telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమీర్ ఖాన్ కి బాలీవుడ్ వుడ్ బర్త్ డే విషెష్…

ameerkhan

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పుట్టినరోజు నేడుమార్చి 14.. 1973లో ‘యాదోం కి బారాత్’ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన ఆమిర్.. తర్వాత హీరోగా ప్రేమకథా చిత్రాలు, కమర్షియల్ సినిమాలూ చేస్తూ తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. స్తుతం హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్ ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో నటిస్తున్నారు. ఆమిర్ 55వ పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అజయ్ దేవ్‌గణ్, ఆయుష్మాన్ ఖురానా, జూహీ చావ్లా, మాధురీ దీక్షిత్ వంటి పలువురు బాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి ఫోటోలను ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఆమిర్ ఖాన్.

Related posts