telugu navyamedia
వార్తలు సామాజిక

పుణే శాస్త్రవేత్తలు ముందడుగు.. తొలిసారి కరోనా ఫొటోలు రూపకల్పన

corona photos pune

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పుణే శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ ఇమేజింగ్‌ ద్వారా భారత్‌లో తొలిసారి ఈ వైరస్‌ చిత్రాలను రూపొందించారు. ఈ చిత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. ఈ ఏడాది జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది.

చైనాలోని వూహాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన కేరళకు చెందిన ముగ్గురు మెడిసిన్ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. భారత్‌లో నమోదైన తొలి మూడు కేసులు ఇవే. వీరి నమూనాలను పూణెలోని ప్రయోగశాలకు పంపారు. ఆ నమూనాల నుంచి కోవిడ్-19కు దగ్గరి పోలికలు ఉన్నాయని ఈ చిత్రాల ద్వారా తెలుస్తున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ చూడడానికి కిరీటంలా కనిపిస్తుండడంతో దీనికి కరోనా అనే పేరు వచ్చిందని వివరించారు.

Related posts