telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

సీఎం జగన్ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం

jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు సచివాలయం ఉద్యోగులతో గ్రీవెన్స్ హాల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తామని ప్రకటించారు. అలాగే సీపీఎస్ రద్దు విషయంలో రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. 

ముఖ్యమంత్రి నిర్ణయంపై ఉద్యోగ సంఘాలతో పాటు చాలామంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలంటే అందరు ఉద్యోగుల సహకారం అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. అందరూ కలిసి ప్రజలకు మెరుగైన పాలన అందిద్దామని పిలుపునిచ్చారు. 

Related posts