సీపీఎస్‌పై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. జీపీఎస్ పై పలు దఫాలుగా ఉద్యోగులతో చర్చించామని, ఫైనల్ డ్రాఫ్ట్ ను ఉద్యోగులకు వివరించామన్నారు.
జీపీఎస్‌లో అనేక ప్రయోజనాలు చేర్చామని, గతంలో చెప్పినదాని కంటే జీపీఎస్‌ను మరింత మెరుగుచేశామన్నారు.
జీపీఎస్‌కు చట్టబద్ధత కల్పిస్తున్నామని…ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేదని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎన్నో ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయని అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేరాయని, మిగిలిన 5 శాతంలో CPS ఒక అంశమంటూ మంత్రి బొత్స అన్నారు.
రిటైర్ అయ్యాక గ్యారంటీగా కనీసం 10 వేలు పెన్షన్ ఉండేలా చూస్తామని అన్నారు. పెన్షనర్ చనిపోతే భార్య లేదా భర్తకు పెన్షన్ ఇస్తామని అన్నారు.
ప్రభుత్వ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలని ఆయన సూచించారు. ఉద్యోగులతో మరోసారి చర్చలు జరుపుతామని.. జీపీఎస్ ఫైనల్ అయ్యాక. చట్ట బద్ధత కల్పిస్తామని తెలిపారు.
కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కంటే మెరుగైన పథకాన్ని తీసుకురావాలనే ఆలోచనతో జీపీఎస్ ను తెచ్చామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు
చంద్రబాబు భార్యను ఎవరో ఏదో అన్నారని ఎలా ఫీలయ్యారో చూశామంటూ బొత్స సెటైర్లు వేశారు. రాజకీయంగా చూసుకోవాలి కాని నీచమైన ఆరోపణలు చేయొద్దని ఆయన హితవు పలికారు.
లక్షలాది మంది రైతులకు గ్యారెంటీ వుందా.. నాయకులైన మాకు గ్యారెంటీ వుందా , అదృష్టవశాత్తూ ఉద్యోగులకు గ్యారెంటీ వుందని బొత్స అన్నారు. అయినా ఉద్యోగులు ఆందోళన చేస్తామంటే ఏం చేయలేమని.. ఉద్యోగులపై పెట్టిన కేసుల గురించి కూడా చర్చించామని మంత్రి తెలిపారు
ఫలితాల రోజే కూటమి సమావేశం: చంద్రబాబు