telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

డిగ్రీ ఫీజులు : ఏపీ హైకోర్టు సీరియస్

ap high court

ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాల డిగ్రీ ఫీజుల జీవో రద్దు చేసింది ఏపీ హైకోర్టు. ఫీజుల సిఫార్సు అంశంలో ఏపీ ఉన్నత విద్యా కమిషన్ తీరును తప్పుబట్టింది హైకోర్టు. అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ఫీజుల అంశంలో చట్ట నిబంధనలు పాటించకపోవడాన్ని తప్పుపట్టిన హైకోర్టు..వ్యక్తిగతంగా కానీ, నేరుగా కానీ కళాశాలల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా సొంత రుసుములను కమీషన్ సిఫార్సు చట్టఉల్లంఘనే అని పేర్కొంది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరం ప్రైవేటు, అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో ఫీజులు ఖరారు చేస్తూ జీవో నెంబర్ 1ని తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది జనవరి 8న జీవో నెంబర్ 1ని విడుదల చేసింది. ముందస్తుగా కళాశాలకు సమాచారం ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాయి శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు జిల్లాల కళాశాలలు. జోవో నెం 1 ను కొట్టి వేస్తూ కళాశాలలకు ముందస్తు సమాచారం ఇచ్చి వారితో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు తాత్కాలిక రుసుములే విద్యార్థుల నుండి వసూలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related posts