telugu navyamedia
telugu cinema news

బిగ్ బాస్-3లో వెంకటేష్… క్లారిటీ వచ్చేసింది 

venkatesh as host to bigg boss3
స్టార్ మా యాజమాన్యం జూన్ లో బిగ్ బాస్-3ని మొదలుపెట్టబోతున్నారని సమాచారం. అయితే ఈ మూడవ సీజన్ కు వ్యాఖ్యాత ఎవరనే విషయంపై బాగానే చర్చ జరుగుతోంది. తెరపైకి వెంకటేష్, చిరంజీవి, ఎన్టీఆర్ ల పేర్లు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై వెంకటేష్ క్లారిటీ ఇచ్చేశారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో “ఎఫ్ 2” సినిమా రూపొందింది. పూర్తిస్థాయి వినోదాత్మకంగా నిర్మితమైన ఈ సినిమా రేపు భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే వెంకటేష్ బిగ్ బాస్ గురించి వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చారు.
‘బిగ్ బాస్ 3’ షోకి నేను వ్యాఖ్యాతగా చేయనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు. ఇదంతా కేవలం ఒక రూమర్ మాత్రమే” అని చెప్పుకొచ్చారు. మరి ఈ విషయంపై చిరంజీవి, ఎన్టీఆర్ ఏమంటారో చూడాలి. 

Related posts

‘స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్‌’లో స్మార్ట్, 3డీ సినిమాలు..!

vimala p

`రంగ‌స్థ‌లం `ఫేమ్ మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న `నేను నా నాగార్జున` సినిమా ఫ‌స్ట్ లుక్‌

ashok

ప్రియా వారియర్ కు బెదిరింపులు… దునియా మొత్తం నీ న్యూడ్ లైఫ్ చూస్తుంది…

vimala p