telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఖైదీ” దర్శకుడితో కమల్ హాసన్… ఫస్ట్ లుక్ విడుదల

Kamal

కార్తీ హీరోగా తెర‌కెక్కించిన చిత్రం “ఖైదీ”తో లోకేశ్ కనగరాజ్ భారీ హిట్ కొట్టిన తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఇటీవల విజయ్ హీరోగా ‘మాస్టర్’ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఈలోగా దర్శకుడు లోకేశ్ తన అభిమాన నటుడు కమలహాసన్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. వీరిద్దరి కాంబినేషన్లోనూ రూపొందే భారీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తో కూడిన అధికారిక ప్రకటన ఈ రోజు వచ్చింది. ఇది విలక్షణ నటుడు కమలహాసన్ నటించే 232వ చిత్రం. పైగా ఈ చిత్రాన్ని కమల్ తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తుండడం ఒక విశేషం. యువ సంగీత దర్శకుడు అనిరుథ్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగును వచ్చే నెల నుంచి నిర్వహిస్తారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి అంటే వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేలా సినిమా నిర్మాణాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ ను చాలా గమ్మత్తుగా డిజైన్ చేశారు. ‘ఒకానొక సమయంలో అక్కడ ఒక దెయ్యం నివసించేది..’ అనే అర్థం వచ్చేలా ఇంగ్లిష్ లో క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందని తెలుస్తోంది

Related posts