telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రవితేజ కంటే ముందు క్రాక్ కథతో మరో హీరోను కలిసిన గోపిచంద్…

Venkatesh

సంక్రాంతి సందర్బంగా విడుదలైన క్రాక్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజా అందరని అలరించారు. ఈ సినిమా విడుదల రోజు కాస్త ఆలస్యం అయినా బొమ్మ మాత్రం అదిరిపోయింది. చాలా కాలం తరువాత రవితేజా ఫుల్ మీల్స్ లాంటి సినిమా చేశాడని అభిమానలు సంతృప్తి చెందారు. ఈ సినిమాతో గోపీచంద్, రవితేజా కాంబో హ్యాట్రిక్ చేసింది. వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి. అయితే క్రాక్ సినిమాను మొదటగా ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశాకే రవితేజ చెంతకు చేరిందట. అయితే ఆ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో కాదు. టాలీవుడ్‌లె విజయాన్నే ఇంటిపేరు చేసుకున్న విక్టరీ వెంకటేష్. మొదటగా ఈ సినిమా కథను తీసుకొని గోపీ వెంకీని కలిసాడట. కథ మొత్తం విన్న వెంకీకి కథపైన అంత నమ్మకం కలుగలేదంట. దాంతో కథలో కొన్ని మార్పులు చేయాలని ఆ మార్పులను చెప్పాడట. కానీ గోపీ ఆ మార్పులు చేయడానికి సుముఖం చూపలేదట. దాంతో వెంకీ ఈ సినిమాకి నో చెప్పాడు. దాని తరువాత అదే కథను రవితేజ వద్దకు తీసుకెళ్తే రవితేజ వెంటనే ఓకే చెప్పాడట. అప్పటికే గోపీతో రెండు సినిమాలు చేసిన రవితేజ మరోసారి గోపీని నమ్మేందుకు ఆలోచించలేదు. అంతే వీరి కాంబో 2021ని భారీ బ్లాక్ బస్టర్‌తో ప్రారంభించింది. చూడాలి మరి వీరి త్వరలో మరో సినిమా ఏదైనా తీస్తారా… అనేది.

Related posts