telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ భూత వైద్యుడు

New couples attack SR Nagar

హైదరాబాద్‌లో ఓ భూత వైద్యుడు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండకు చెందిన దంపతులు ఇంట్లో చికాకుల కారణంగా మూడు వారాల క్రితం మల్లేపల్లికి చెందిన భూత వైద్యుడు ఆజంను కలిశారు. వారు చెప్పింది విన్న ఆజం ఇంట్లో దెయ్యం ఉందని, దాని వల్లే చెడు జరుగుతోందని వారిని నమ్మించాడు.

ఇందులో భాగంగా వారిని రెండుసార్లు బీదర్‌లోని ఓ దర్గాకు తీసుకెళ్లి పూజలు చేశాడు. అనంతరం బాధిత దంపతుల కుమార్తె (19)ను ఓ గదిలోకి తీసుకెళ్లి రహస్యంగా మాట్లాడాడు. తనను పెళ్లి చేసుకోకుంటే మీ తల్లిదండ్రులు చనిపోతారని యువతిని భయపెట్టాడు. ఈ నెల 11న బోరబండలోని యువతి నివాసానికి వచ్చిన ఆజం బెదిరించి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు మెరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts