telugu navyamedia
news sports trending

మరో రికార్డు చేరువలో ఆల్‌రౌండర్‌ అశ్విన్‌

ఇండియా  ఆల్‌రౌండర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అశ్విన్‌ ఒక స్పిన్నర్‌గానే కాకుండా బ్యాట్స్‌మెన్‌గా కూడా రాణించగల సత్తా ఉన్న ఆటగాడు. సింపుల్‌గా చెప్పాలంటే రవిచంద్రన్‌ అశ్విన్‌ మంచి ఆల్‌రౌండర్‌ అన్న మాట. ఎందుకంటే బౌలింగ్‌ పరంగానే గాక.. తన బ్యాటింగ్‌తోనూ టీం ఇండియాను చాలా సార్లు ఆదుకున్నాడు. అంతేకాదు మొన్న ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులోనూ అశ్విన్‌ చెలరేగాడు. ఇది ఇలా ఉండగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. అహ్మదాబాద్‌ మొతేరా స్టేడియంలో జరగనున్న మూడో టెస్ట్‌లో మరో ఆరు వికెట్లు పడగొడితే.. 4 వందల వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డులకెక్కనున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో కలిపి అశ్విన్‌ 17 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో రెండు సార్లు 5 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డ్‌.. శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ పేరు మీద ఉంది.

Related posts

“జాను” మా వ్యూ

vimala p

పవన్ కళ్యాణ్ పేరుకు చాలా విలువ ఉంది… స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మి

vimala p

ఢిల్లీ అభ్యర్థి గంబీర్ పై .. మహిళా నేత అభ్యన్తరాలు..

vimala p