telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆర్సీబీ ఓటమికి .. కారణాలు.. 2020లో అయినా టైటిల్ కొడుతుందా.. !

is rcb win 2020 ipl title or not

ఎంతోమంది విదేశీ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్, కెవిన్ పీటర్సన్ ఆర్సీబీ లో ఉన్నారు. అంతేకాకుండా రాహుల్ ద్రావిడ్, జహీర్ ఖాన్, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, మనీష్ పాండే వంటి సీనియర్, యువ ఇండియన్ ప్లేయర్స్‌ కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఐపీఎల్‌లో ఇప్పటివరకు ట్రోఫీ గెలవని రాయల్ ఛాలెంజర్స్ టీమ్. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి సుమారు 12 సంవత్సరాలు అవుతోంది. భారత్ ఆటగాళ్లు, విదేశీ ప్లేయర్స్‌తో కలిసి.. ఆర్సీబీ ఎంతో బలమైన టీమ్. కానీ ఒక్క ఏడాది కూడా కప్ గెలవలేకపోయింది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే భారత్ టీమ్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఈ టీమ్.. ఇన్నాళ్లు ట్రోఫీ గెలకపోవడం సగటు క్రికెట్ ప్రేమికుడిని నిరాశకు గురి చేస్తుంది.

ఆర్సీబీ పగ్గాలను విరాట్ కోహ్లీ చేపట్టి తొమ్మిదేళ్లు అవుతున్నా.. ఈ టీమ్ ఇంతవరకు మొదటి టైటిల్ గెలవలేదు. ప్రతీ ఏడాది ఫ్యాన్స్ నిరాశతో వెనుదిరుగుతున్నా.. ఆర్సీబీపై మాత్రం నమ్మకాన్ని వదల్లేదు. చిన్నస్వామి స్టేడియం.. రెడ్ ఫ్లాగ్స్‌తో.. ఆర్సీబీ.. నినాదాలతో హోరెత్తిపోతుంది. 2020 సీజన్‌కు ఫ్రాంచైజీ.. టీమ్‌ను మరింత బలోపేతం చేయడానికి సన్నద్ధం అవుతోందని తెలుస్తోంది. క్రిస్ లిన్, డేవిడ్ మిల్లర్, రాబిన్ ఉతప్ప, మిచిల్ స్టార్క్, జయదేవ్ ఉనాద్కట్.. వంటి ఎందరో మేటి ఆటగాళ్లు ఆక్షన్‌లో ఉన్నారు. అంతేకాక బెంగుళూరు టీమ్‌లో 12 స్లాట్స్(6 విదేశీ) ఖాళీగా ఉన్నాయి. కేఎల్ రాహుల్.. 2020 సీజన్‌కు పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. ఇలా ఒకటేమిటి.. చాలా కారణాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ కూడా కొన్నిసార్లు సరైన డెషిషన్స్ తీసుకోకపోవడం కూడా ఆర్సీబీ ఫేట్‌ను మార్చడం జరుగుతోంది. ధోని లాంటి సమర్ధుడైన కెప్టెన్ దగ్గర సూచనలు తీసుకుంటూ.. టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందిస్తున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటికైనా కరెక్ట్ డెసిషన్స్ తీసుకుని ఆర్సీబీకి టైటిల్ అందిస్తాడో లేదో వేచి చూడాలి.

Related posts