కరోనా లాక్ డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా దాదాపు ఇంటికి పరిమితమైన సెలబ్రిటీలందరూ ఇప్పుడిప్పుడే కాలు బయటపెడుతున్నారు. కొంతమంది షూటింగ్స్‌లో పాల్గొంటుండగా మరికొందరు విహార యాత్రలకు వెళుతున్నారు. హీరోయిన్ తాప్సీ మాల్దీవులు వెళ్లిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన తాప్సీ ఇటీవల మాల్దీవులకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాల కోసం బికినీ ధరించడానికి నో చెప్పలేదు. కానీ, ఆ డ్రెస్ వేసుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు. ఫ్యాన్స్ కూడా నన్ను బికినీలో చూడడానికి ఇష్టపడరు. అందంగా కనిపించడమంటే స్కిన్ షో చేయడం కాదని పేర్కొంది. స్కిన్ షో విషయంలో నేను కొన్ని నియమాలు పెట్టుకున్నా. బికినీ డ్రెస్ నాకు సౌకర్యంగా అనిపించలేదు. ఫస్ట్ క్రష్ గూర్చి చెపుతూ.. మొదటి ప్రేమ ఎప్పటికీ ఓ మధురమైన జ్ఞాపకంగానే ఉంటుంది. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు నా తోటి విద్యార్థిని ఇష్టపడ్డాను. అదే నా ఫస్ట్ క్రష్. అతను కూడా నన్ను ఇష్టపడ్డాడు. చదువుపై దృష్టిసారించాలనే ఉద్దేశంతో కొంతకాలానికి మాట్లాడడం మానేశాడు. అప్పట్లో మొబైల్ ఫోన్లు లేకపోవడంతో పబ్లిక్ ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేసి బాగా ఏడ్చేశాను అంటూ తాప్సీ పేర్కొంది.
previous post