telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కరోనా వార్తలపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కారు

ap

కరోనా వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల్లో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్ధాలతో కూడిన వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సామాజిక బాధ్యతతో మీడియా సంయమనం పాటించాలని కోరుతూ కరోనా వార్తల ప్రచురణ కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి పేరుతో కరోనా వైరస్‌ (కోవిడ్‌ –19)కు సంబంధించి వార్తా కథనాలపై పత్రికలు, టీవీ చానళ్ల అధిపతులు, ఎడిటర్లు, బ్యూరో చీఫ్‌లు, రిపోర్టర్లు పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం పేర్కొంది.

మార్చి 20వ తేదీన విశాఖలో కరోనా వైరస్‌తో మరణం అంటూ పలు వార్తా సంస్థలు, చానళ్లు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం వల్ల ఎదురైన ఆందోళనను దృష్టిలో పెట్టుకుని వీటిని జారీ చేసినట్టు పేర్కొంది. ఈ మార్గదర్శకాలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిరోజూ బులెటిన్‌ విడుదల చేస్తుంది. అందులో నిర్ధారించిన ఈ సమాచారాన్ని మాత్రమే పత్రికలు, టీవీలు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.

Related posts