telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్

నీరవ్ మోదీ .. బ్యాంకులలో కోట్ల రూపాయలు..ఖాతాలు స్తంభింపచేసిన ఈడీ ..

london court on nirav modi jailed

సింగపూర్ హైకోర్టు కూడా ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీకి షాకిచ్చింది. పీఎన్‌బీ మోసం చేసిన కేసులో ఇప్పటికే అరెస్టైన ఆయన కుటుంబసభ్యులకు.. విదేశాల్లో వారికి చెందిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయాలంటూ ఈడీకి సింగపూర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నీరవ్ మోదీ సోదరి పుర్వి మోదీ, బావ మయాంక్ మోహతాల ఖాతాలను అక్కడి బ్యాంకులు జప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ అకౌంట్స్‌లో సుమారు 6.122 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ. 44.41 కోట్లు ఉన్నట్లు పేర్కొంది.

ఈ సొమ్మంతా కూడా మోసంతో కూడబెట్టిందే కాబట్టి, దీన్ని నిందితులు విత్‌డ్రా చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో న్యాయస్థానం, ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే నీరవ్‌ మోదీకి స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న నాలుగు ఖాతాలను అక్కడి బ్యాంకులు జప్తు చేశాయి. వీటిలో దాదాపు రూ. 283 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసును ఈడీ, సీబీఐ తదితర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. గతేడాది జనవరిలో దొంగచాటున విదేశాలకు పారిపోయిన నీరవ్‌ని ఇటీవల లండన్‌లో అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Related posts