అత్యంత తీవ్ర తుఫాను ‘తౌక్టే’ (pronounced as Tau’Te) గడచిన 6గంటలలో 10 km వేగంతో ప్రయాణిస్తూ, బలహీనపడి ఈ రోజు ఉదయం 08:30 am గంటలకు సౌరాష్ట్ర ప్రాంతంలో ‘అతి తీవ్ర తుఫానుగా’ 21.6°N latitude మరియు 71.3°E longitude లలో, అమ్రేలికి తూర్పు దిశగా 10 km దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 3గంటలలో ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి, మరింత బలహీనపడి తుఫానుగా మరియు ఈరోజు సాయంత్రం వరకు వాయుగుండంగా బలహీనపడుతుంది. సుమారుగా 21.05.2021 వ తేదీన నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతములోనికి ప్రవేశించే అవకాశం ఉంది. సుమారుగా 23.05.2021వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులోని ఆగ్నేయ మరియు దక్షిణ గాలులు వీస్తున్నాయి.
———————————
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
——————————
ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.
ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
——————————
ఈరోజు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.
ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.
రాయలసీమ:
———————-
ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.
ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందిమరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.