telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా సినిమా రికార్డును మరో సినిమా బ్రేక్ చేస్తే… అల్లు అర్జున్

Ay

సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, గ్లామ‌ర్ బ్యూటీ పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రంలో సుశాంత్‌, న‌వదీప్, టబు ముఖ్య పాత్ర‌లు పోషించారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఈ చిత్రం కి సంబంధించి నిన్న థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుక‌లో పంపిణీ దారుల‌కి, చిత్ర బృందానికి బ‌న్నీ చేతుల మీదుగా జ్ఞాపిక‌ని బ‌హుక‌రించారు. అయితే త‌మ చిత్రం నాన్ బాహుబ‌లి రికార్డ్‌లు చెరిపేసింద‌ని చెబుతూ విశాఖ‌ప‌ట్నం, గుంటురు, ఈస్ట్ గోదావ‌రి, కృష్ణ‌, నైజాం, సీడెడ్‌, నెల్లూరు, వెస్ట్ గోదావ‌రి త‌దిత‌ర ఏరియాల‌లో క‌లెక్ష‌న్ల సునామి సృష్టించింద‌ని ట్రైల‌ర్ ద్వారా తెలిపారు. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం త‌న కెరీర్‌లో మ‌రో మైల్‌స్టోన్‌గా నిలిచింద‌ని బ‌న్నీ థ్యాంక్స్ మీట్‌లో తెలిపారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవల సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సినిమా టీం నిన్న థ్యాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ “ముందుగా సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు మీడియాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ థ్యాంక్స్ మీట్ ఎందుకు పెట్టామంటే.. మా దగ్గర ప్రొడక్షన్ కంపెనీ కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసేవాళ్లు ఎప్పుడూ నన్ను ఓ మాట అడుగుతూ ఉంటారు. ఏంటండీ ఎప్పుడు సినిమా హిట్ అయినా మీరు మీ టీం మాత్రమే సక్సెస్ మీట్స్ నిర్వహిస్తుంటారు. మా గురించి పట్టించుకోరా, మాకు షీల్డ్ ఇచ్చి సత్కరించరా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు వారికి ఓ మాట చెప్పాను. డిస్ట్రిబ్యూటర్స్‌కి షీల్డ్స్ ఇచ్చి సత్కరించేంత గొప్పగా నా సినిమా ఆడినప్పుడు తప్పకుండా ఫంక్షన్ చేస్తాను అని. ఆ కోరిక ‘అల వైకుంఠపురములో’ సినిమాతో తీరింది. నాకు ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ ఇచ్చింది. ఈ రికార్డును మరో సినిమా బ్రేక్ చేస్తే అప్పుడే సినీ పరిశ్రమ మరో మెట్టు ముందుకు వెళ్లినట్లు. కాబట్టి నా రికార్డును మరెవరైనా బ్రేక్ చేయాలని ఆశిస్తున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి ప్రేక్షకులకు ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఈ సినిమాలోని ‘సిత్తరాల సిరపడు’ పాటలో సిగరెట్ తాగుతూ కనిపిస్తాను. కానీ దయచేసి మీరు మాత్రం నన్ను ఫాలో అయి సిగరెట్ కాల్చడం వంటివి చేయకండి. నేను సినిమాలో ఆ పాత్ర వరకు సిగరెట్ తాగాను. నాకు నిజ జీవితంలో అసలు ఆ అలవాటే లేదు. అది మంచిది కాదు కూడా” అని తెలిపారు.

Related posts