హైదరాబాద్ నగరంలో వ్యాక్సిన్ వికటించి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో గురువారం జరిగింది. చిన్నారులకు వ్యాక్సిన్లు వేయించేందుకు పలువురు నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ కు వచ్చారు. అయితే… వ్యాక్సిన్‌తో సంబంధంలేని ట్యాబ్లెట్లు ఇవ్వడంతో 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే చికిత్స నిమిత్తం వారిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
వీరిలో ముగ్గురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమమంగా ఉందని వైద్యులు తెలిపారు. వ్యాక్సిన్ తర్వాత నొప్పికి ఇవ్వాల్సిన టాబ్లెట్లు వేరేవి ఇవ్వడంతో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన బాధిత కుటుంబ సభ్యులు నిలోఫర్ ఆస్పత్రికి చేరుకున్నారు. దాంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం నీలోఫర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.