బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమాయాణం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి అంటూ ఇప్పటికే ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఆలియా, రణబీర్ తమ బంధం గురించి ప్రకటించకపోయినా… అందరికీ వారి ప్రేమాయణం గురించి తెలిసేలాగే ప్రవర్తిస్తుంటారు. తన బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌కు గతంలో విఫలమైన ప్రేమకథలు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోనని ఆలియా భట్ అంటోంది. తాజాగా ఆలియా రణబీర్ తో తన ప్రేమబంధం గురించి మాట్లాడుతూ “మేమిద్దరం మంచి స్నేహితులం. రణ్‌బీర్ నా జీవితాన్ని సంతోషంతో నింపాడు. ఇద్దరం వృత్తిపరంగా చాలా బిజీగా ఉన్నాం. ఎవరి కళ్లూ మా బంధంపై పడకూడదు. రణ్‌బీర్‌కు గతంలో లవ్‌స్టోరీస్ ఉన్న సంగతి నిజమే. వాటి గురించి నేను పట్టించుకోను. నాకూ అలాంటి లవ్‌స్టోరీలు ఉన్నాయి కదా. అయితే `రణ్‌బీర్‌తో పెళ్లెప్పుడు ? అని మీడియా రోజూ ప్రశ్నించడం చిరాకు పెడుతుంటుంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఇవే వార్తలు. ఈ వార్తలకు మేం అలవాటు పడిపోయాము” అని ఆలియా చెప్పింది.
next post