telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోతో బోల్డ్ హీరోయిన్ ఘాటు రొమాన్స్… ఫోటోలు లీక్

Radhika-Apte

బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే తన మనసులో ఏమున్నా ధైర్యంగా, బోల్డ్ గా మాట్లాడేస్తుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ “ద వెడ్డింగ్ గెస్ట్” అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్ ఒకటి సోష‌ల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఆ సీన్‌లు త‌న పేరుతో ప్ర‌చారం కావ‌డంపై రాధిక ఆప్టే ఫైర్ అయ్యింది. ఈ సందర్భంగా బాలీవుడ్ లైఫ్ పత్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాధికా మాట్లాడుతూ “మేల్ యాక్ట‌ర్ దేవ్ ప‌టేల్ కూడా ఈ సీన్ లో న‌టించాడు. కాని అతని పేరిట స్ప్రెడ్ చేయ‌కుండా, నా ఒక్క పేరుతో ఎందుకు షేర్ చేస్తున్నారు. అలాగే సినిమాలో ఎన్నో మంచి సీన్స్ ఉన్నాయి. కాని శృంగారానికి సంబంధించిన సీన్స్ మాత్ర‌మే లీక్ చేశారు. ఇందుకు కార‌ణం మన సమాజం సైకోటిక్‌ మెంటాలిటీ. నేను చిన్న‌ప్పుడు అనేక ప్రాంతాలు తిరిగాను. ప‌లువురిని క‌లిసాను. చాలా కంఫ‌ర్ట‌బుల్‌గా ఉన్నాను. మన‌ దేశంలోనే కాక విదేశాల‌లోను న‌టులు వేదిక మీద న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌డం చూశాను. బోల్డ్‌ సీన్లలో నటించే విషయంలో నాకెలాంటి భయాలు లేవు. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలి. న‌ట‌న విష‌యంలో నా శ‌రీరం కూడా నాకు సాధ‌నం లాంటిందే” అంటూ చెప్పుకొచ్చింది రాధికా.

Related posts