telugu navyamedia
రాజకీయ వార్తలు

రైతుల ఆందోళన పై వ్యవసాయశాఖ మంత్రి తోమర్ కీలక వ్యాఖ్యలు…

ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రైతులతో చర్చలు జరిపి త్వరగా ఈ ఆందోళనకు ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తోంది.  రైతులు కోరిన ప్రతిపాదనలకు ఒకే చెప్తూ సవరణలు చేసేందుకు సిద్ధం అయ్యింది.  అయితే, ఇప్పుడు రైతులు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తుండటంతో కేంద్రం ససేమిరా అంటోంది.  కనీస మద్దతు ధర విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, ప్రతి ఏడాది కనీస మద్దతు ధర పెరుగుతుందని రైతులు భయపడాల్సిన అవసరం లేదని ఇప్పటికే కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి తోమర్ పేర్కొన్నారు.  రైతులకు రక్షణ కల్పించే అంశాలను చట్టంలో పొందుపరిచినట్టు అయన తెలిపారు.  కాంట్రాక్ట్ వ్యవసాయంలో రైతుల భూమికి రక్షణ ఉంటుందని అన్నారు.  వ్యవసాయ చట్టాల వాళ్ళరైతులు లభ్ది పొందుతున్నారని తెలిపారు.  కానీ, పంజాబ్ సహా కొన్ని రైతు సంఘాలు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు.  అక్టోబర్ నుంచి డిసెంబర్ 8 వరకు ఆరుసార్లు చర్చలు జరిపామని రైతులు లేవనెత్తిన అభ్యంతారాలపై కేంద్రం ప్రతిపాదనలు పంపిందని కానీ, రైతులు చట్టాలను మొత్తం రద్దు చేయమంటున్నారని అన్నారు.  రైతుల సమస్యలు పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, మార్కెట్ వ్యవస్థలో ఉన్న అపోహలు తొలగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తోమర్ పేర్కొన్నారు.  గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ వ్యవసాయం అమలౌతోందని, ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని అన్నారు.  కాంట్రాక్టు వ్యవసాయంలో రైతు భూమిపై కాంట్రాక్టు ఋణం తీసుకునే అవకాశం లేకుండా చేస్తామని చెప్పామని అన్నారు.  విద్యుత్ బిల్లుల అంశంపై కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్టు అయన పేర్కొన్నారు.

Related posts