తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగా తెరాస నేత కేసీఆర్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ, 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే సీఎం కేసీఆర్ 160 చేస్తారన్నారు అని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ… మనం 16 స్థానాలు గెలిపిస్తే దేశంలో మరో 150 మంది తోడయ్యే అవకాశం ఉందన్నారు.
బీజేపీ అంటే ఇష్టంలేనివారు, కాంగ్రెస్ అంటే పడని ప్రాంతీయ పార్టీలు దేశంలో 10 నుంచి 15 ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఉత్తప్రదేశ్‌లో మాయావతి, అఖిలేష్‌యాదవ్ ఉన్నారు. మరోవైపు ఏపీలో జగన్‌మోహన్ రెడ్డి… ఇలా చాలా మంది మనవెంటే ఉంటారన్నారు కేటీఆర్.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ అంటే పడని పార్టీల ఎంపీల సంఖ్యే 150 దాటుతుందన్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీకి లాభమని.. ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్… 16 మంది ఎంపీలతో అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఏం చేస్తారో అంచనా వేయాలన్నారు. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్.. ఇలా చాలామంది కేసీఆర్ వెంట నడిచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణ స్కూళ్లలో అధిక ఫీజులు: లక్ష్మణ్