ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ జిల్లా సీలేరు నదిలో ప్రయాణికులతో వెళుతున్న రెండు నాటు పడవలు ప్రమాదానికి గురయ్యాయి. పడవలు నీట మునగడంతో 8 మంది గల్లంతు కాగా.. వారిలో ఓ చిన్నారి మృత దేహం దొరికింది. ప్రమాదం నుంచి బయటపడి 3 సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గిరిజనులు ఒడిషా వెళ్లేందుకు నాటు పడవలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వలస కూలీలు 11 మంది ఒడిషా వెళ్లేందుకు అర్థరాత్రి సీలేరు చేరుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో నాటు పడవల్లో వెళుతుండగా ప్రమాదం జరుగినట్లు సమాచారం. గల్లంతైన 7 గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
previous post
next post
చరిత్రహీనుడు చంద్రబాబు: రోజా