ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఇప్పటికే పలువురు బొత్స వ్యాఖ్యలను తప్పుబట్టారు. తాజాగా టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఘాటుగా స్పందించారు.
బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానంతో పోల్చడం సరికాదని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. అమరావతి నగరం ఎంతో మంది ఆశలకు, ఆశయాలకు, రాష్ట్ర ప్రజల కలలకు ప్రతీకగా నిర్మితమవుతోందని పేర్కొన్నారు. అలాంటి నగరాన్ని అవమానించే వ్యాఖ్యలు చేసిన బొత్స ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.