telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

రామ్ కు నోటీసులు జారీ చేస్తాం : విజయవాడ ఏసీపీ

Ram

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై హీరో రామ్ వరుస ట్వీట్లు చేశారు. సీఎం జగన్ వెనక భారీ కుట్ర ఉందంటూ, ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ఇదంత చేస్తున్నారంటూ రామ్ చేసిన ట్వీట్లు సంచలనం రేపిన విషయం తెలిసిందే. మరోవైపు విజయవాడ పోలీసులు కూడా దీనిపై స్పందించి.. అగ్ని ప్రమాద ఘటనపై తమకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కు కూడా నోటీసులు పంపుతామని తెలిపారు. ఈ క్రమంలోనే రామ్ విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఇంకోసారి తాను ట్వీట్ చేయనని ప్రకటించారు. న్యాయంపై తనకు నమ్మకముందని, ఎవరైనా, ఎవరికి చెందిన వారైనా నిజమైన దోషులకు శిక్ష పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే సామాజిక వేదికలపై ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చని, అలాగని విచారణకు ఆటంకం కలిగిస్తే నటుడు రామ్‌కి 91 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేస్తామని విజయవాడ దక్షిణ మండలం ఏసీపీ నక్కా సూర్యచంద్రరావు స్పష్టం చేశారు. స్వర్ణప్యాలెస్‌లో అగ్నిప్రమాద ఘటనపై ఆయన దర్యాప్తు అధికారిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రామ్‌ ఇటీవల చేసిన ట్వీట్‌పై స్పందించారు. దీనిని చూస్తే ఆయనకు అవగాహన లేదనిపిస్తోందని తెలిపారు. “క్వారంటైన్ వేరు… కోవిడ్ కేర్ సెంటర్ వేరు. ఆ ఘటనకు సంబంధించి రామ్ వద్ద ఆధారాలు ఉంటే మాకు చూపించాలి. రమేశ్‌ ఆస్పత్రి ఎండీ పి.రమేశ్‌బాబుకు మరోసారి నోటీసు ఇస్తాం. ఈ ఘటనలో ఇప్పటివరకు సీఈవో డాక్టర్‌ మమత, డాక్టర్‌ సౌజన్యను విచారించాం. ఆయన అల్లుడు కల్యాణ చక్రవర్తి, ఆయన సోదరుడు, ఆస్పత్రి డైరెక్టర్లు మొబిన్‌, విల్సన్‌, శ్రీనాథ్‌రెడ్డిలకూ నోటీసులు ఇచ్చాం. ఘటన జరిగిన తర్వాత డాక్టర్‌ రమేశ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు. అక్కడి నుంచి పరారయ్యారు” అని ఏసీపీ తెలిపారు.

Related posts