మోడి ప్రభుత్వం సీబీఐ, ఈడీ, కొన్ని మీడియా సంస్థలను వాడుకుంటోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రతిష్ఠను దిగజార్చేందుకే మోడి సర్కార్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం వ్యవహారంపై రాహుల్ ట్విటర్‌లో స్పందించారు.
అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతూ మోడి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో అభియోగాల నేపథ్యంలో చిదంబరం దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిన్న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.