telugu navyamedia
telugu cinema news

అమీర్ ఖాన్ తో విజయ్ సేతుపతి సినిమా

Vjay-Sethupathi

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో భారతీయ చలన చిత్రోత్సవం జరుగుతోంది. ఈ వేడుకలో ఇండియాలోని పలు భాషలకు చెందిన 60 చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. వీటిలో తమిళ పరిశ్రమ నుంచి కుమారరాజ త్యాగరాజన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి నటించిన “సూపర్‌ డీలక్స్‌” చిత్రం ప్రదర్శించబడి ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్ర విభాగాలకు సంబంధించి పోటీ నెలకొంది. ఉత్తమ నటుడిగా విజయ్‌ సేతుపతి ఎంపికై అవార్డును దక్కించుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలోకి క్యారెక్టర్ నటుడిగా అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ సేతుపతి. తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నాడు. అయితే విజయ్ సేతుపతి.. త్వరలోనే బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌తో కలిసి నటించబోతున్నాడట. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలో విజయ్ వెల్లడించాడు. విజయ్ నటిస్తున్న ‘సంఘ తమిళన్‌’ చిత్రీకరణ స్పాట్‌కు ఆమీర్‌ఖాన్‌ వచ్చినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. దీంతో వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆ వార్త నిజమేనని విజయ్ తాజాగా ధ్రువీకరించాడు. “సంఘ తమిళన్‌` చిత్రీకరణ స్పాట్‌కు ఓ సారి ఆమీర్‌ఖాన్‌ వచ్చిన మాట నిజమే. ఆయనతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నా. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తాము” అని విజయ్ వెల్లడించాడు.

Related posts

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ ఎమోషనల్ వీడియో

vimala p

భారీ పౌరాణిక చిత్రానికి మంచు విష్ణు సన్నాహాలు

vimala p

అఖిల్ సినిమాలో జాయిన్ అయిన పూజాహెగ్డే

vimala p