telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫుల్లుగా తాగుతున్న సీనియర్ నటి…

 

టాలీవుడ్‌లో మంచి బజ్ ఉన్న సినిమాల్లో చావుకబురు చల్లగా కూడా ఒకటి. కార్తికేయ హీరోగా తెరకెక్కతున్న ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సి అయితే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కౌషిక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇందులో బుల్లితెర బ్యూటీ అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా…ఇందులో అలనాటి నటి ఆమని నటిస్తోంది. ఈ మూవీ లో గంగమ్మ అనే పాత్రలో ఆమని కనిపించునుంది. అయితే తాజాగా ఆమె ఊరమాస్ పాత్ర స్వభావన్ని తెలియజేసే పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో వంట చేస్తూ..మందు కొడుతోంది ఆమని. ఈ పోస్టర్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. ఆమె యాక్టింగ్ తో ఈ మూవీ మరో రేంజ్ కు వెళ్ళానుందట. 

Related posts