telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ బాల్ షార్జా నుండి అబుదాబిలో పడేది : యువరాజ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్ 31లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఇన్నింగ్స్ తర్వాత క్రిస్ గేల్ చరిత్రలో గొప్ప టీ 20 ఆటగాడిగా ఎందుకు పరిగణించబడుతున్నాడు అనేది అందరికి అర్ధమైంది. విరాట్ కోహ్లీ యొక్క జట్టు పై 172 పరుగుల విజయవంతమైన రన్-చేజ్‌లో గేల్ 45 బంతుల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున తన మొదటి మ్యాచ్‌లో 53 పరుగులు చేశాడు. అలాగే గేల్ ఐపీఎల్ లో తన 29 వ అర్ధ సెంచరీ నమోదు చేయడం మాత్రమే కాకుండా 4500 పరుగులు ఔర్తి చేసాడు.

ఐపిఎల్ 2020 లో గేల్ ఆటను అభిమానులు మాత్రమే క్రికెట్ మాజీలు కూడా ఆస్వాదించారు. అయితే క్రికెట్ ప్రపంచం లో గేల్ కు మంచి స్నేహితుడిగా ఉన్న యువరాజ్ సింగ్, ఈ వెస్టిండీస్ లెజెండ్ బ్యాటింగ్ ప్రదర్శనను ప్రశంసించాడు. తన ట్విట్టర్ లో “యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కరెక్ట్ గా బంతిని మిడిల్ చేస్తే అది షార్జా నుండి అబుదాబిలో పడుతుంది” అని యువీ ట్వీట్ చేశాడు. అయితే ఈ విజయం కారణంగా పంజాబ్ ప్లేఆఫ్‌ రేసు ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Related posts