telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారు: విజయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.చంద్రబాబు ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారని దుయ్యబట్టారు. సహకార డెయిరీలు, విద్యా సంస్థలు, ఆర్టీసీ, ఏపీ జెన్కో, డిస్కంలు అన్నీ దివాళా తీస్తుంటే రోగానికి చికిత్స చేయకుండా సపట్ మలాం పూసి చల్లగా జారుకున్నారని ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలు, గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లు, చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సంస్థల గురించి ప్రస్తావిస్తూ వరుస ట్వీట్లు చేశారు. లైసెన్సు లేకుండా వాహనం నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అడ్డుకుంటే.. లైసెన్సు లేని వారందరిని పట్టుకున్న తర్వాతే నా దగ్గరకు రండి అన్నట్టుగా చంద్రబాబు వ్యవహారం ఉందన్నారు. అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చిన తర్వాతే లింగమనేని గెస్ట్ హౌస్‌ జోలికి రావాలని బాబు అల్టిమేటం ఇస్తున్నారని విమర్శించారు.

Related posts