మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చేరికపై విస్తృత ప్రచారం జరుగుతున్నాప్పటికీ తేదీపై స్పష్టత లేదు. ముందుగా ఆగస్ట్ 15 అన్నారు. ఆ తర్వాత 9న అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి తాజాగా 1 16వ తేదీని ఫిక్స్ చేశారు.
రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో గంటా వైసీపీలో చేరనున్నారు. ప్రస్తుతానికి వైసీపీ మద్దతుదారుడిగా గంటా కొనసాగగా, ఆయన వర్గానికి చెందిన పలువురు కూడా వైసీపీ కండువాలు కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.

