telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

Covid-19

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.96 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..అయితే తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 146 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్కరు కూడా మరణించలేదు. ఇదే సమయం లో 118 మంది కోలుకున్నారు. దీంతో… పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,134 కు చేరుకోగా… 2,92,696 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,613 మంది కరోనాతో మృతి చెందారు. ఇక, తెలంగాణలో కరోనా మృతుల శాతం 0.54 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉందని.. రాష్ట్రంలో రికవరీ రేటు 98.83 శాతంగా ఉంటే.. భారత్‌లో 97.2 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో 1,825 యాక్టివ్ కేసులు ఉండగా… వీరిలో 765 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,755 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Related posts