అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై గతంలో ఎన్నడూ లేనంత విధంగా 70,354 ఓట్ల మెజార్టీతో విజయఢంకా మోగించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా కూటమి హవా కొనసాగుతోంది.
అటు పవన్ కల్యాణ్ గెలిచిన విషయాన్ని తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
టీవీ స్క్రీన్‌పై పవన్ విజయాన్ని చూసి.. ఆయన సోదరి కాస్త ఎమోషనల్ అయ్యారు. కాగా, కుటుంబ సభ్యులు, జనసైనికులతో కలిసి పిఠాపురంలో నాగబాబు ఎన్నికల ఫలితాలను పర్యవేక్షిస్తున్నారు.
ఇక పవన్ విజయంతో జనసైనికులు సంబరాల్లో మునిగిపోయారు.