కొల్లేరు సమస్య జటిలం కావడానికి రాజకీయాలే కారణం. ఆపరేషన్ కొల్లేరు పేరుతో నాటి వైఎస్ ప్రభుత్వం చెరువుల గట్లు పేల్చేసింది. 2006లో నాటు బాంబులతో కొల్లేరులోని చెరువుల గట్లు పేల్చేసింది.
పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం కూటమి ప్రభుత్వానిది.
కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించే బాధ్యత , కొల్లేరు పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వానిదే.
సమస్యలకు మూలకారణాల అన్వేషణ బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది, సమస్యలపై కొల్లేరువాసులతో వివిధ సందర్భాల్లో మా పార్టీ చర్చించింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ సమతుల్యమైన పరిష్కారం దిశగా చర్చిస్తున్నారు. అధికారులు, నిపుణులు, ప్రాంతవాసులతో పవన్ భేటీ అయ్యారు.
ఎన్నో సంక్షిష్ట సమస్యలను పరిష్కరించిన అనుభవం సీఎంకు ఉంది. అని ప్రకటన లో జనసేన పేర్కొంది.