telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో పార్టీ పెట్ట‌డంపై వైఎస్ ష‌ర్మిళ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. హైద‌రాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఈ కామెంట్స్ చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీ పెడుతున్నారా? అని ఓ మీడియా ప్ర‌తినిధి ప్రశ్నించగా.. ఏపీలో పార్టీ పెట్ట‌కూడ‌ద‌ని రూల్ ఏం లేదు క‌దా? అంటూ ఎదురు ప్ర‌శ్నించారు షర్మిల. రాజ‌కీయ పార్టీ ఎక్క‌డైనా పెట్టొచ్చని ష‌ర్మిల స్ప‌ష్టం చేశారు. మేం ఒక మార్గాన్ని ఎంచుకున్నామ‌ని.. ఆ విధంగానే ముందుకెళ్తున్నామ‌ని వైఎస్ ష‌ర్మిల స్పష్టం చేశారు.

Sharmila to take a different route from now on - TeluguBulletin.com

కాగా.. రైతు ఆవేదన యాత్ర పేరుతో మరోసారి పాదయాత్రకు పూనుకుంటున్నారు. ఈ నెల 19 లేదా 20 నుంచి తెలంగాణలో పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్టుగా షర్మిల తెలిపారు. నిబంధనల ప్రకారం యాత్ర నిర్వహిస్తామని చెప్పిన అనుమతి ఇవ్వడం లేదని మండిప‌డ్డారు.

రైతు బంధు పండుగలకు మాత్రం నిబంధనలు అడ్డు రావని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే నిబంధనలు అని ఆమె మండిపడ్డారు. బీజేపీ, కేసీఆర్ రెండు ఒక్కటేనని విమర్శించారు.

ఇక‌పోతే..గత కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో విబేధాలు చోటుచేసుకున్నాయని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. వైఎస్ జ‌గ‌న్‌కు, ష‌ర్మిల‌కు ప‌డ‌టం లేద‌ని, వీరిద్ద‌రి మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయని మీడియాలో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

Andhra Pradesh CM's Sister YS Sharmila Likely to Announce Her Party Today

క్ర‌మంలో తెలంగాణలో తన అన్నకు ఇష్టం లేకపోయినా పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నా రనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో అనుకున్న స్థాయిలో రాజకీయంగా రాణించలేకపోతున్న షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా చ‌ర్చానీయంశంగా మారింది.

Related posts