ఏపీలో విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, సిపిఐ సీనియర్ నేత కాకర్ల పూడి సుబ్బరాజు మృతి చెందారు. విజయవాడలోని తన నివాసంలో గుండె పోటుతో ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని మార్చురీలో ఉంచారు. అమెరికా నుంచి కొడుకు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయవాడ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా, సిపిఐ, అనుబంధ సంఘాల్లో వివిధ హోదాల్లో సుబ్బరాజు పని చేశారు. ఉమ్మడి ఏపీలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పని చేశారు. విద్యార్థి, యువజన నేతగా, శాంతి స్నేహ సంఘీభావ సంఘం, ఇస్కఫ్ జాతీయ నాయకునిగా, విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శిగా, కోశాధికారిగా ఆయన తన సేవలందించారు. ఇక సుబ్బరాజు మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. కామ్రేడ్ కె సుబ్బరాజు మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని.. సుబ్బరాజు కుటుంబ సభ్యులకు సిపిఐ ఏపీ రాష్ట్ర సమితి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
previous post
మోదీతో గొడవవద్దని చంద్రబాబుకు చెప్పాను.. వినిపించుకోలేదు: అంబికా కృష్ణ