ప్రస్తుతం తెలంగాణలో అందరూ ఎదురు చూస్తున విషయం వైఎస్ షర్మిల కొత్త పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారు అనేది. అయితే ఆవిడ ప్రస్తుతం వైఎస్ఆర్ అభిమానులతో వరుస కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఆవిడ ముస్లిం మైనార్టీల్లోని వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం అయ్యారు వైఎస్ షర్మిల.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారామె.. తెలంగాణ ప్రభుత్వం.. ముస్లింలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటుంటే.. కేంద్రం మాత్రం వారిని హేట్ బ్యాంక్‌గా వాడుకుంటుందని విమర్శించారు. తెలంగాణలో ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల… ముస్లింలులేని తెలంగాణను ఊహించలేం అన్నారు.. తెలంగాణలో ముస్లింల అభివృద్ధికి గంగా జమున తహజీబ్ అన్నారు.. కానీ, ఇప్పుడు వక్ఫ్ బోర్డు భూములు 50వేల ఎకరాలు కబ్జాకి గురయ్యాయని ఆరోపించారు.. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారంటూ ఫైర్ అయిన షర్మిల… ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్సార్ ది అని గుర్తు చేశారు. ఇక, మనం కలిస్తే మళ్లీ రాజన్న సంక్షేమ పాలన తేవొచ్చు అన్నారామె. అయితే షర్మిల వచ్చే నెల లో కొత్త పార్టీని అధికారికంగా ప్రకటిస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post
పంత్ భారత జట్టుకే కెప్టెన్ అవచ్చు : అజహరుద్దీన్