telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జూలై 8న షర్మిల కొత్త పార్టీ

ఖమ్మంలో నిన్న సంకల్ప సభ పేరుతో షర్మిల పబ్లిక్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చారు షర్మిల. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడ్డారు. రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థానంతో సంక్షేమ పధకాలకు శ్రీకారం పడిందని…రాజకీయాల్లోకి రాజన్న పాదయాత్ర రోజున ఏప్రిల్ 9 న తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని సంకల్ప సభలో షర్మిల పేర్కొన్నారు. తెలంగాణలో ఒక్క రాజకీయ పార్టీని పెట్టబోతున్నానని.. రాజన్న సంక్షేమ పథకాలు తీసుకువస్తానని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో ప్రశ్నించడానికి, నిలదీయడానికి మన పార్టీ అవసరమని షర్మిల వెల్లడించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం అన్న కేసీఆర్… ఆ ఉద్యోగాలు ఎటు పోయాయి…ఇంటిలో ఆత్మహత్య చేసుకుంటేనే ఉద్యోగం వస్తాడా అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి ఉందని ఫైర్‌ అయ్యారు. కేసిఆర్‌ సార్ హాస్పిటల్ బిల్స్ కూడా చెల్లించడం లేదని…5 ఏళ్ల మాత్రమే సిఎంగా వైస్సార్ 46 లక్షల ఇల్లులు కట్టించారని పేర్కొన్నారు. వైస్సార్ కట్టించిన ఇళ్లను హేళన చేసిన కేసీఆర్… ఇప్పుడు ఎన్ని ఇల్లులు కట్టించారని నిలదీశారు.
ప్రజల సమస్యలను వినే ఓపిక ఈ దొరలకు లేదని..సచివాలయంకు కూడా అడుగు పెట్టని సిఎం కేసీఆర్ ఒక్కడే… చివరకు ఆ సచివాలయాన్ని కూడా కూల్చేశాడని మండిపడ్డారు షర్మిల. తెలంగాణ వచ్చిన తరువాత ఆత్మహత్యలకు కారణాలు ఎవ్వరు ? ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి కార్యకర్తలే రేపటి నాయకులు అని…ఆత్మగౌరవ తెలంగాణ కోసం పార్టీని.. వైస్సార్ జన్మ దినం రోజున జులై 8 న పార్టీని ఆవిష్కరిస్తానని షర్మిల ప్రకటించారు.

Related posts