ఒడిషా కూలీలు మృతి- 3 లక్షలు పరిహారం ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కూలీలు మృతి చెందారు. సీఎం జగన్ మావనతాదృక్పథంతో స్పందించి మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి వచ్చి అగ్ని ప్రమాదంలో చిక్కుకోవడం బాధకరమని, ఇక, రొయ్యలచెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్.


