యనమల… ఓ చెత్త ఫైనాన్స్ మినిష్టర్ అని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సీఎం జగన్ ప్రమాణం చేసే నాటికి ఖజానాలో 100 కోట్లు మాత్రమే మిగిలాయి. దొరికిన చోటల్లా మేమే అప్పులు తెచ్చాం. ఇంకెక్కడా రూపాయి అప్పు పుట్టదు అని పబ్లిగ్గానే చెప్పిన యనమలకు శ్వేత పత్రం కావాలట. ఆర్థిక నిర్వహణలో దేశంలోనే చెత్త ఫైనాన్స్ మినిష్టర్ ఇలా డిమాండు చేయడం వింతగా లేదూ?మీ ఉడత ఊపులు, తొండ తోపులు, పిల్లి అరుపులకు ఎవరూ భయపడిపోరు. కర్ర వంకర పొయ్యి తీర్చేస్తుంది. అక్షరం- ఆయుధం అంటూ వక్రభాష్యాలు నడవవు. మీ దమ్ము- దుమ్ము, మన్నూ – మశానం ఆటలన్నీ చంద్రబాబు దగ్గరే. బరితెగిస్తే బడితపూజే. ” అంటూ ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి. ఇక అంతకు ముందు ట్వీట్లో “తలుపులు తడతారంటూ వాలంటీర్లను అవమానించిన చంద్రబాబు ముఖంపై జనమే తలుపులేస్తున్నారు. ఢిల్లీనే వణికించానని చెప్పుకునే వాడి తిరుపతి గల్లీ ప్రచారంలో పట్టుమని పదిమందీ కనిపించడం లేదు అని తెలిపారు.
previous post
next post


ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్న కేసీఆర్: భట్టి విక్రమార్క