telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఒక్కరోజులోనే 9 వేల కరోనా మరణాలు…

చైనాలో మొదలైన కరోనా కేసులు ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.  కొన్ని దేశాల్లో కరోనా తగ్గుముఖం పట్టినా, యూరప్ లో రెండోదశ కరోనా విజృంభిస్తోంది.  ఇక అమెరికాలోనైతే చెప్పాల్సిన అవసరం లేదు.  ఎన్నికల తరువాత ఆ దేశంలో రోజు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  నిన్న ఒక్కరోజులో ప్రపంచవ్యాప్తంగా 6,45,661 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ప్రపంచం మొత్తం మీద నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,37,21,389కి చేరింది.  ఇక నిన్న ఒక్కరోజు కరోనాతో 9860 మంది మరణించారు.  దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,08,483కి చేరింది.  ఇక అమెరికాలో నిన్న ఒక్కరోజులో 1,77,772 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,58,308కి చేరింది.  కరోనాతో నిన్న ఒక్కరోజులో 1365 మంది మరణించారు.  దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 2,49,945కి చేరింది. అయితే మన దేశంలో కూడా రోజుకు వేల లాంఖ్యలో కేసులు నందిక్కవుతున్నాయి. అయితే కొంతమంది ప్రముఖులు ఈ వైరస్ కు వ్యాక్సిన్ వచ్చిన దీనిని మనం కంట్రోల్ చేయలేము అంటున్నారు.

Related posts