telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఆమె బెడ్ పై న్యూడ్ గా… అసలేం జరిగిందంటే…

Sex

సోషల్ మీడియా పుణ్యమా అని సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు ఇంతకు ముందుకన్నా ఇప్పుడు చాలా తొందరగా సాక్ష్యాలతో సహా మన కళ్ళముందు ముందు నిలుస్తున్నాయి. అయినా యువత మేలుకోవడం లేదు. ఒకరికి జరిగిన అలాంటి సంఘటనే తమ జీవితంలో జరుగుతున్నా… మోసం జరుగుతోందని ఏమాత్రం గ్రహించడం లేదు… జాగ్రత్తగా ఉండడం లేదు. మహిళలపై, చిన్న పిల్లలపై ఎన్నో లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. అయినా సరే కొంతమంది అమాయకురాళ్లు మోసగాళ్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. తాజాగా జీన్ ఫిలిప్ అనే వ్యక్తి ఓ మహిళను దేవుడి పేరుతో ఆమె సమస్యలు తీరుస్తానని చెప్పి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కష్టాల్లో ఉన్న ఓ మహిళను గమనించిన జీన్… తాను దేవుడిని ప్రార్థించి, ఆమె సమస్యలన్నీ మాయం చేస్తానని నమ్మించాడు. అతని మాటలను నమ్మింది సదరు యువతి. శనివారం సాయంత్రం తన ఇంటికి రావాల్సిందిగా కోరాడు అతను. అతను చెప్పినట్లుగానే ఆమె శనివారం సాయంత్రం జీన్ ఇంటికి చేరుకుంది. 

ఆమెను సాదరంగా ఆహ్వానించిన జీన్… యువతికి టీ ఆఫర్ చేశాడు. అంతే టీ తాగిన రెండు గంటలు స్పృహ కోల్పోయింది. కళ్ళు తెరిచి చూస్తే… బెడ్ రూమ్ లో ఒంటిపై బట్టలు లేకుండా ఉంది. జరిగిన దారుణాన్ని అర్థం చేసుకుని… వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది ఆ యువతి. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు గతంలోనూ ఇలాగె కొంతమందిపై లైంగిక దాడి చేశాడని తెలుసుకున్న పోలీసులు… జీన్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అందుకే మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండండి.

Related posts