telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

చెయ్యని తప్పుకు శిక్ష… విడుదలవ్వగానే అదే తప్పు చేసి…!

అమెరికాలో జార్జ్ పెర్రట్ అనే 50 ఏళ్ళ వ్యక్తి చేయని తప్పుకు 30 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాడు. 1985లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ జార్జ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. 2016లో ఈ కేసులో జార్జ్ తప్పులేదని తెలుసుకున్న కోర్టు వెంటనే అతన్ని విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. జార్జ్‌ను విడుదల చేసిన కొద్ది కాలానికే పోలీసులు మరోమారు అరెస్ట్ చేశారు. అయితే ఈ సారి పక్కా ఆధారాలతో జార్జ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఓ యువతికి మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కోర్టు జార్జ్‌కు ఎన్నేళ్ల శిక్ష వేస్తుందో చూడాలి.

Related posts