అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవిలు జంటగా నటించిన లవ్ స్టోరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ లవ్ స్టోరీకి మంచి టాక్ రాగ చైతు కెరీర్ లో మరో హిట్ అంటూ అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ లవ్ స్టోరీ ప్రమోషనల్ ఈవెంట్ కి స్పెషల్ గెస్టుగా హాజరైన అమీర్ ఖాన్ కి స్పెషల్ పార్టీ ఇచ్చారు నాగార్జున.
బిగ్ బాస్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈవెంట్ కి గైర్హాజరైన నాగ్.. లవ్ స్టోరీ టీమ్ కి పార్టీ ఇవ్వగా.. ఆ పార్టీకి అమీర్ ఖాన్, నాగచైతన్య, శేఖర్ కమ్ముల, సాయి పల్లవిలతో పాటు అఖిల్ కూడా హాజరై కేక్ కటింగ్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో నాగచైతన్య గురించి అమీర్ ఖాన్ తో కొన్ని ఎమోషనల్ అంశాలని తలుచుకున్నాడు నాగార్జున.
అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న’లాల్ సింగ్ చద్దా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు చైతు. ఈ మూవీలో తెలుగు ఆర్మీ ఆఫీసర్ బాలరాజు పాత్ర చేస్తున్నాడు నాగచైతన్య. అయితే అప్పట్లో ఏఎన్నార్ కూడా బాలరాజు అనే బ్లాక్ బస్టర్ మూవీ చేశాడని.. మళ్ళీ అదే పేరుతో చైతు చేస్తున్నాడని, కచ్చితంగా బాలీవుడ్ లో చైతు రాణిస్తాడని అమీర్ తో నాగ్ చెప్పాడట.
ఇక ఎఎన్నార్ ప్రేమ్ నగర్ మూవీ కూడా ఇదే డేట్ కి యాభై ఏళ్ళ క్రితం విడుదలై సంచలన విజయం సాధించింది. ఈరోజు ఇదే డేట్ కి లవ్ స్టోరీ కూడా విడుదలైందని.. చైతు గురించి చెప్తూ నైట్ పార్టీలో ఎమోషనల్ అయ్యాడట నాగ్.
ఇక తాజాగా నాగచైతన్య సమంతలు విడాకులు తీసుకుంటున్నారని వచ్చిన వార్తలు పై ‘లవ్‌స్టోరీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌లో.. ఎన్ని వార్తలు వచ్చినా.. వాస్తవాలు మాత్రమే ప్రజలకు గుర్తుంటాయని అర్థమైనప్పటి నుంచి నేను వాటి గురించి పట్టించుకోవడం లేదు’’ అని చైతు కొట్టిపడేయటం జరిగింది.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు… క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు