telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ వాట్సాప్ గురించి హెచ్చ‌రిస్తున్న సైబ‌ర్ నిపుణులు…

whatsapp

ప్రస్తుతం పింక్ వాట్సాప్ సందేశం ఒక్క‌టి వైర‌ల్‌గా మారిపోయింది.. అత్యాధునిక ఫీచర్ల కోసం ‘పింక్‌ వాట్సాప్‌’ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సందేశం.. ఇప్పుడు ఏ వాట్సాప్ గ్రూప్‌లో చూసిన ద‌ర్శ‌నం ఇస్తుంది.. వాట్సాప్‌ పింక్‌ పేరుతో సోష‌ల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ఈ లింక్.. తెలిసితెలియ చాలా మంది దీనిని షేర్ చేస్తూనే ఉన్నారు.. క్లిక్ చేస్తూనే ఉన్నారు..  అయితే, పింక్ వాట్సాప్ యాప్ పై హెచ్చ‌రిస్తున్నారు సైబ‌ర్ నిపుణులు.. పొర‌పాటును పింక్ వాట్సాప్ లింక్‌ను క్లిక్ చేశారంటే.. మీ ఫోన్‌లోని ఫొటోలు, సందేశాలు, కాంటాక్ట్స్‌ వంటి స‌మాచారం స‌ర్వం సైబర్‌ కేటుగాళ్ల చేతికి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు.. కేవ‌లం, వాట్సాప్‌ అధికారిక యాప్‌ను మాత్ర‌మే గూగుల్‌ ప్లేస్టోర్‌, యాప్‌స్టోర్‌ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని.. కానీ, ఇలాంటి లింక్‌ల జోలికి వెళ్లొద్ద‌ని వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి.

Related posts