telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఏమైంది?

తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా కేంద్రప్రభుత్వాన్ని మాటల తూటాలతో పేల్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకెళ్లి తేల్చుకుంటామన్నారు. యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేస్తారా? లేదా? అంటూ ప్రగతిభవన్ లో నిలదీసిన కేసీఆర్… చెప్పినట్టుగానే ఢిల్లీ వెళ్ళి ఎవ్వరినీ భేటీ కాలేదని తెలుస్తోంది.

ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ మినహాయిస్తే… ఆయన కుమారుడు, పురపాలక కేటీఆర్, పౌరసరఫరాలమంత్రి గంగుల కమలాకర్, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కేశవరావు తదితరులు కేంద్రవ్యవసాయశాఖమంత్రి నరేందర్ సింగ్ తోమర్ తో భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను ఎవ్వరినీ కలవలేదని సమాచారం. ఆలస్యంగా వెలుగుచూసిన నిజం ఆసక్తిరేకెత్తిస్తోంది. కేసీఆర్ ఎవ్వరినీ అపాయింట్ మెంట్ కోరలేదనే అంశం ప్రస్తావనకొచ్చింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలవడానికి వీలుగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యాలయం లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలే దని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

CM KCR meets PM Modi, requests funds for textile park and an IIM in  Telangana | The News Minute

అయితే గత సెప్టెంబర్‌ 1వ తేదీన అపా యింట్‌మెంట్‌ కోసం విజ్ఞప్తి వచ్చిందని, దాంతో అదే నెల 3వ తేదీన అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం, సీఎం కేసీఆర్‌ వారిని కలవడం జరిగిందని గుర్తు చేశాయి.

Telangana CM KCR Delhi Tour: Meets To Union Minister Amit Shah - Sakshi

నీటి పంపకాలు, వరి ధాన్యం కొను గోలుపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవ డానికి ఢిల్లీ వెళ్తామని, అవసరమైతే తాను ప్రధానిని కలు స్తానని గత శనివారం సీఎం విలేకరుల సమా వేశంలో నిప్పులు చెరిగారు. ఆ మరు సటి రోజే ఢిల్లీ బయ ల్దేరి వెళ్లిన సీఎం బుధవా రం సాయంత్రం హైదరా బాద్‌ తిరిగి చేరు కున్నారు.

Telangana CM KCR in Delhi but skips meet supporting Kejriwal, raises  eyebrows | The News Minute

అయితే నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్‌.. మోదీని, అమిత్‌ షాను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరినా ఇవ్వలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చా యి.  ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరుతూ తమకు ఎలాంటి వర్తమానం అందలేదని తెలిపాయి.

Related posts