telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

గిరిజన హాస్టల్లో గర్భం దాల్చిన విద్యార్థినులు!

కొమురంభీం జిల్లా అసిఫాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ వసతి గృహంలో కళాశాల విద్యార్ధినులు గర్భం దాల్చడం సంచలనం రేపుతోంది. పదిమంది విద్యార్థినులకు ఇటీవల నెలసరి రాకపోవడంతో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది వారిని రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు జరిపించారు. ఈ పది మందిలో ముగ్గురికి ప్రెగ్నెన్సీ పరీక్షలు పాజిటివ్ గా వచ్చాయని వైద్యులు వెల్లడించారు.

నెల రోజుల తర్వాత మరోసారి పరీక్షలు జరిపించగా ఒక్కరికే గర్భం అని వైద్యులు తేల్చారు. దీంతో.. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. హాస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆర్సీవో లక్ష్మయ్య విద్యార్థినుల నుంచి వివరాలను తెలుసుకుని రికార్డు చేసుకుంటున్నారు.

ఈ ఘటనపై హై కోర్టు జడ్జితో విచారణ జరపించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. గిరిజన బాలికల కాలేజీలో డిగ్రీ ప్రధమ సంవత్సరం చదువుతున్న కొందరు విద్యార్ధినులు హాస్టల్‌లో ఉంటున్నారు. ఈ బాలికల్లో కొందరు గర్భవతులైనట్టు వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ పేద గిరిజన బాలికలను మోసగించిన వారిపై అత్యాచారం, మోసం, పోక్సో కింద కుసులు నమోదుచేయాలని బాలల హక్కులసంగం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు.

Related posts