మేడ్చల్ ఔటర్ రింగురోడ్డుపై ఓ ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన శ్యాంసుందర్ తన భార్య జ్యోతి, కుమార్తెలు మేఘన, గాయత్రితో కలిసి బాసరకు బయలుదేరారు.
మేడ్చల్ జిల్లా కీసర రింగురోడ్డు మీదుగా శామీర్‌పేట వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్‌ను వీరు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అల్వాల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జగన్ పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా?: చంద్రబాబు