పశ్చిమ బెంగాల్ లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించింది. మూడు దశాబ్దాల తర్వాత ఖరగ్ పూర్, కలియాగంజ్ స్థానాల్లో టీఎంసీ విజయపతాకం ఎగురవేసింది. ఈ మూడు స్థానాల్లో రెండు చోట్ల గత 30 ఏళ్లలో టీఎంసీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ ఘన విజయాలతో, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా టీఎంసీ అధినేత మమతా బెనర్జీ మాట్లాడుతూ, బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ రాజకీయ అహంకారానికి బెంగాల్ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. రాజకీయాల్లో అహంకారం పనికిరాదని చెప్పారు. బీజేపీని ప్రజలు తిరస్కరించారని తెలిపారు.

