తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి సీఎం కేసీఆర్ 3,303 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించిన విషయాన్ని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ శాసన సభా పక్షం కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఎస్‌ఆర్‌టీసీ కార్మికులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ప్రైవేటీకరణకు ఎత్తుగడ వేస్తోందని బీజేపీ దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు.
బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేశారా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఆర్టీసీని బాగు చేసేందుకు అన్ని విధాలా సహకరించిన కేసీఆర్ ప్రభుత్వంపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రాజకీయ లబ్ధికోసం బీజేపీ నాయకులు కొనసాగిస్తున్న డ్రామాలు కట్టిపెట్టాలని హితవు పలికారు.
బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్..10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు