telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

శ్రీశైలంకు పోటెత్తిన వరద.. మూడు గేట్లు ఎత్తివేత

srisailam is full capacity water released

శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1990 నుంచి ఇప్పటి వరకు ఒకే ఏడాదిలో ప్రాజెక్టు గేట్లు ఐదుసార్లు ఎత్తి వేయడం ఇదే మొదటిసారి. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,26,805 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 1,80,761 క్యూసెక్కులుగా ఉంది.

జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులను సంతరించుకుంది. అదేవిధంగా పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీల సామర్థ్యాన్ని కలిగిఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.

Related posts